హైదరాబాద్: నగరంలోని బోరబండ జీహెచ్‌ఎంసీ (GHMC) కార్యాలయంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కార్యాలయానికి చెందిన జూనియర్ అసిస్టెంట్ శ్రీలత లక్ష రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఓ ఇంటి నిర్మాణ అనుమతికి సంబంధించిన ఫైలును క్లియర్ చేయడానికి శ్రీలత బాధితుడి నుండి ఏకంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 1 లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ కొనసాగింది. ప్రస్తుతం కార్యాలయంలో మరిన్ని సోదాలు జరుగుతున్నాయి.

