రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా జైలర్-2. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తమిళ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' సినిమాపై ప్రశంసలు కురిపించారు. 'రజనీ స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు నేను ఫిదా అయ్యా. ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపే కమర్షియల్ ఎంటర్‌టైనర్. అనిరుధ్ సంగీతం, నెల్సన్ దర్శకత్వం, చిత్రబృందం కృషి కనిపిస్తోంది. చొక్కా నలగకుండా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం' అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు.

