Dailyhunt
Jaishankar Bhupalpally: వివాహేతర సంబంధం అనుమానం..కన్నతండ్రిని కొట్టి చంపిన కుమారులు

Jaishankar Bhupalpally: వివాహేతర సంబంధం అనుమానం..కన్నతండ్రిని కొట్టి చంపిన కుమారులు

యశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కన్నతండ్రిపైనే కుమారులు దాడికి పాల్పడగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

బాధితుడు చెరాలు గ్రామంలో ఒంటరిగా నివసిస్తుండగా, అతడి భార్య, కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. తండ్రి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న కుమారులు గ్రామానికి వచ్చి, తండ్రిని ఆ మహిళను తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చెరాలు ప్రాణాలు కోల్పోయారు. సదరు మహిళ ప్రస్తుతం చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu