Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం..12 దుకాణాలు బుగ్గి, కోట్లలో ఆస్తి నష్టం!

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం..12 దుకాణాలు బుగ్గి, కోట్లలో ఆస్తి నష్టం!

కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి పెను నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే పక్కనే ఉన్న దుకాణాలకు వేగంగా విస్తరించాయి.

ఈ ప్రమాదంలో సుమారు 12 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఇందులో బట్టల షాపులు, కిరాణా దుకాణాలు, ప్లాస్టిక్ వస్తువుల విక్రయ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. మంటల ధాటికి దుకాణాల్లోని సామాగ్రి అంతా కాలిపోవడంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడం వల్ల మంటలు సమీపంలోని ఇతర నివాస సముదాయాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.

అదృష్టవశాత్తూ ఈ ఘటన రాత్రి సమయంలో జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక శాఖాధికారులు మరియు రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి నష్ట తీవ్రతను లెక్కిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్నిప్రమాదంతో అటు వ్యాపారులు, ఇటు స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu