Dailyhunt
కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నాయకురాలు కన్నుమూత

కాంగ్రెస్‌లో తీవ్ర విషాదం.. సీనియర్ నాయకురాలు కన్నుమూత

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మీరట్ నుండి మూడుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన మోహసినా కిద్వాయ్ ఈరోజు కన్నుమూశారు. ఆమె ఉదయం 4 గంటలకు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

ఆమె వయస్సు 93 సంవత్సరాలు, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలి మరణం రాజకీయ వర్గాలలో విషాద ఛాయలు నింపింది. పలువురు ప్రముఖ నాయకులు తమ సంతాపం తెలిపారు.

మోహసినా కిద్వాయ్ అంత్యక్రియల ప్రార్థనలు నోయిడాలోని సెక్టార్ 40లో ఉన్న ఆమె నివాసంలో మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగుతాయి. సాయంత్రం 5:00 గంటలకు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశానవాటికలో ఆమెను ఖననం చేస్తారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాలలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో, కిద్వాయ్ ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటకం, పౌర విమానయానం వంటి పలు మంత్రిత్వ శాఖలలో పనిచేశారు.

మాజీ పార్లమెంట్ సభ్యురాలు మొహ్సీనా కిద్వాయ్ 1932 జనవరి 1న ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకిలో జన్మించారు. ఆమె చాలా చిన్న వయస్సులోనే రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఆ తర్వాత, ఆమె జాతీయ రాజకీయాల్లో చురుగ్గా మారారు. మొహ్సీనా కిద్వాయ్ ఛత్తీస్‌గఢ్ నుండి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొహ్సీనా 1978 ఉప ఎన్నికలో మీరట్ నుండి తొలిసారిగా లోక్‌సభ ఎంపీ అయ్యారు. ఆమె 1980, 1984లో కూడా మీరట్ నుండి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తదనంతరం, ఆమె 2004,డి 2010 వరకు, 2010 నుండి 2016 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు.

మోహసినా కిద్వాయ్ భారత జాతీయ కాంగ్రెస్‌లో చాలా సీనియర్ నాయకురాలు. ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో సభ్యురాలిగా పనిచేశారు. ఆమె అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC)కి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ హోదాలో, ఆమె పార్టీ వ్యవస్థీకరణ, వ్యూహరచన మరియు యువ నాయకులకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కిద్వాయ్ ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటకం, పౌర విమానయానం వంటి పలు మంత్రిత్వ శాఖలలో కూడా పనిచేశారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ, మోహసినా కిద్వాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మోహసినా కిద్వాయ్ చాలా సౌమ్య స్వభావం కలవారని, ఆమె వ్యక్తిత్వంలో సరళత, వినయం స్పష్టంగా కనిపిస్తాయని ఆయన అన్నారు. ఆమె మరణం కాంగ్రెస్ పార్టీకి పూడ్చలేని నష్టం. ఆమె కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యురాలిగా అనేక సందర్భాల్లో దేశానికి సేవలందించారు. ఆమె చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu