Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు..?

కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు..?

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా..

ఈ మధ్యే ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతున్నట్లుగా అంతా భావించారు. ఇంతలోనే మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఓ విషయమై వివాదం ముదురుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మంత్రి కొండా సురేఖకు తెలియకుండా కడియం శ్రీహరి దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ రివ్యూ నిర్వహించడంతో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించగా.. దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొండా సురేఖ.. కడియం శ్రీహరిపై స్టేట్‌ కమాండ్‌కి కాకుండా నేరుగా హైకమాండ్‌కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయమై తనకు చెప్పకుండా హైకమాండ్‌కి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్ ఆరా తీయడంతోపాటు.. హైకమాండ్‌కు రాసిన లేఖను బహిర్గత పరచొద్దని మంత్రికి సూచించనట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయమై కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఎటువంటి ధృవీకరణ లేకపోవడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu