Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు వేల కోట్లు..!

కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు వేల కోట్లు..!

రాష్ట్రాల ఆర్థిక స్థితిని మరింత బలపరిచేందుకు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర పన్నుల వాటా కింద దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కసారిగా రూ. 1,09,019 కోట్లను విడుదల చేసింది. పన్నుల వాటా కింద ఏపీకి రూ. 4,597 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి రూ. 2,370 కోట్లు కేటాయించారు. మూలధన వ్యయం పెంచడానికి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేయడానికి ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని కేంద్రం తెలిపింది.

అనుకున్న రోజుకంటే ముందే ఈ అదనపు వాటాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తగినంత నిధుల లభ్యత పెరిగి, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు సంక్షేమ పథకాలు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం కలుగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu