తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక నేరాల నుంచి పిల్లల సంరక్షణ (POCSO) చట్టం కింద కేసు నమోదైంది.
హైదరాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో జరిగిన బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌ల సమయంలో 16 ఏళ్ల మైనర్ బాలిక పట్ల ఆయన అసభ్యకర సైగలు చేస్తూ, లైంగిక వ్యాఖ్యలకు పాల్పడి వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెల 24న తొలుత ఆర్‌సి పురం పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) నమోదు చేశారు. అనంతరం ఘటన జరిగిన పరిధి ఆధారంగా జూలై 24న ఈ కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
మాదాపూర్ పోలీసులు నిందితుడు పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం కేసు నమోదు కావడంతో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
https://telugu.newsmeter.in/pdf_upload/2026/08/04/firmadhapuronly-437419.pdf
https://telugu.newsmeter.in/pdf_upload/2026/08/04/firmadhapuronly-437419.pdf

