Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరో 3 రోజుల్లో 'తల్లికి వందనం' నిధులు జమ..విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!

మరో 3 రోజుల్లో 'తల్లికి వందనం' నిధులు జమ..విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!

ఆంధ్రప్రదేశ్‌లో 'తల్లికి వందనం' పథకం నిధుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, వారి తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మరో మూడు రోజుల్లోగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సహాయాన్ని జమ చేయనున్నట్లు ప్రకటించింది.

ఆగస్టు 30నే ఈ నగదు జమ కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడటంతో అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అర్హుల వివరాలను సేకరించి పరిశీలిస్తున్నారు.

ఈ తాజా విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.80 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులతో పాటు, గతంలో అన్ని అర్హతలు ఉండి కూడా సాంకేతిక లోపాలతో నిధులు పొందని వారికి ఈ దఫాలో నగదు జమ కానుంది. సచివాలయాల నుంచి అందిన లబ్ధిదారుల తుది జాబితాల పరిశీలన పూర్తయిన వెంటనే ఆర్థిక శాఖ నిధులను విడుదల చేయనుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu