Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా డీఎస్సీపై వైసీపీ పోరు..సీబీఐ విచారణ కోరుతూ భారీ ర్యాలీ!

మెగా డీఎస్సీపై వైసీపీ పోరు..సీబీఐ విచారణ కోరుతూ భారీ ర్యాలీ!

నెల్లూరు: మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది.

డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, దీనిపై సీబీఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. వైఎస్సార్సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఈ ర్యాలీకి నాయకత్వం వహించారు.

ర్యాలీ ప్రారంభానికి ముందు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాల వల్ల దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని ఆరోపించారు. తక్షణమే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ యువజన విభాగం ప్రతినిధులు జిల్లా రెవెన్యూ అధికారికి (డీఆర్వో) వినతిపత్రం అందజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu