మేనకోడలిపై అఘాయిత్యం చేశాడని..సొంత కొడుకుపై పోలీసులకు తల్లి ఫిర్యాదు!

మేనకోడలిపై అఘాయిత్యం చేశాడని..సొంత కొడుకుపై పోలీసులకు తల్లి ఫిర్యాదు!

News Meter తెలుగు

News Meter తెలుగు

18hr

Loading...

త్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక తల్లి తన సొంత కొడుకుపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తన మేనకోడలిపై కొడుకు అత్యాచారానికి ఒడిగట్టి, ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ఆమె ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ బాలిక, తండ్రి వ్యసనాలకు బానిస కావడంతో అప్పటి నుండి అత్త (ఫిర్యాదుదారు) వద్దే పెరుగుతోంది. ఈ క్రమంలో నిందితుడు పెళ్లి పేరుతో నమ్మించి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలిక గర్భవతి అని తెలిసిన వెంటనే దిగ్భ్రాంతికి గురైన అత్త, తన సొంత కొడుకని కూడా చూడకుండా బాధితురాలికి న్యాయం చేయాలని భీతౌలీ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. సొంత కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu