Dailyhunt
మియాపూర్‌లో విషాదం..ప్రేమ వివాహం జరిగిన నెలకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్!

మియాపూర్‌లో విషాదం..ప్రేమ వివాహం జరిగిన నెలకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్!

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో పెళ్లైన నెల రోజులకే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు.

వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో 2026 ఫిబ్రవరి 20న వివాహం చేసుకున్నారు.

మియాపూర్ మక్త మహబూబ్‌పేట్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ఈ జంట సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకునేవారు. అయితే, వివాహం జరిగిన కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం నీరజ్ వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి గొడవలు మొదలయ్యాయి. భర్త వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన ఇషికా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu