Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించిన బీజేపీ అధిష్టానం

నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించిన బీజేపీ అధిష్టానం

నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల్ని నియమిస్తూ గురువారం బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రాష్ట్రాలకు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా కొత్త అధ్యక్షుల్ని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రాను, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా కేవల్ సింగ్ ధిల్లాన్‌ను, హరియానా బీజేపీ అధ్యక్షురాలిగా అర్చనా గుప్తాను, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేవ్‌రాయ్‌ను నియమించారు. పంజాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేవల్ సింగ్ ధిల్లాన్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు కాంగ్రెస్‌లో ఉండేవారు. తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సన్నిహితుడు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన హర్ష్ మల్హోత్రా తొలిసారి ఎంపీగా గెలిచారు. హరియాణా అధ్యక్షురాలిగా ఎన్నికైన అర్చనా గుప్తా రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. ఈసారి అధ్యక్షురాలిగా ప్రమోషన్ లభించింది. త్రిపురలో అత్యంత కీలక నియోజకవర్గమైన మతార్బారి నుంచి పోటీ చేసి గెలిచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu