Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నడిరోడ్డుపై దారుణం.. వెనుక నుంచి వచ్చి భర్త గొంతు కోసి చంపిన భార్య ప్రియుడు

నడిరోడ్డుపై దారుణం.. వెనుక నుంచి వచ్చి భర్త గొంతు కోసి చంపిన భార్య ప్రియుడు

హారాష్ట్రలోని పుణె జిల్లాలోని సరోల గ్రామంలో గురువారం రాత్రి అత్యంత కిరాతక ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రియుడు జరిపిన కత్తిపోట్ల దాడిలో 25 ఏళ్ల యువకుడు అమర్ నందు పవార్ దారుణ హత్యకు గురయ్యాడు.

ఈ కేసులో నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీపక్ పాల్‌గా పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మహేష్ ధడ్వే ఇంటి గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. భార్య, వారి చిన్నారితో కలిసి అమర్ నందు పవార్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన నిందితుడు దీపక్ వారిని వెంబడించి దాడి చేశాడు.

పవార్ మెడ, గొంతు భాగంలో కత్తితో విచక్షణారహితంగా పలుసార్లు పొడవడంతో తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే రాజ్‌గడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో నిందితుడు దీపక్ పాల్‌ను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యపై మరింత దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu