కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల యువతిపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి ప్రాణాలు తీశాడు.
ఈ విషాద ఘటన కెనడాలోని నయాగరా ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతురాలిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బోర్సాద్ పట్టణానికి చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. ఆమె గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తున్నారు. చదువుకుంటూనే ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నారు.
మే 15న ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కెనడా పోలీసులు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

