Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు ఈ రాశివారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి!

నేడు ఈ రాశివారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి!

మేషం : నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి.

బంధుమిత్రుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి.

వృషభం : పనుల్లో శ్రమ పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో అనవసర విభేదాలు రావచ్చు. ఖర్చులు అవసరానికి మించి పెరుగుతాయి.

మిథునం : వ్యాపారపరమైన ఇబ్బందులు క్రమంగా తొలగుతాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం : కొత్త వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు.

సింహం : దైవ సంబంధిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో వాహన సంబంధిత ఇబ్బందులు ఎదురుకావచ్చు.

కన్య : సంతానం విద్యా విషయాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ అధికమవుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ఆందోళన పెరుగుతుంది. ఆత్మీయులతో అనవసర కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి.

తుల : వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతానం శుభకార్యాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికం : చేపట్టిన పనుల్లో అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి విందు, వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త పరిచయాల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

ధనుస్సు : దూర ప్రయాణాల్లో కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. అయితే అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న ఒడిదుడుకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. బంధుమిత్రుల వల్ల ఊహించని సమస్యలు రావచ్చు.

మకరం : వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆలోచనల్లో స్థిరత్వం లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కొత్త రుణ ప్రయత్నాలు కూడా అనుకూలించకపోవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి వ్యవహరించడం మంచిది.

కుంభం : భూ సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను సమర్థంగా నిర్వహించి అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆత్మీయులతో ఉన్న వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం : చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. ఇతరులతో కొన్ని విషయాల్లో మాటపట్టింపులు పెరగవచ్చు. గృహ నిర్మాణ పనులు వాయిదా పడే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. దాయాదులతో స్థిరాస్తి విషయాల్లో ఉన్న సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu