తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటించనున్నారు. స్థానికంగా నిర్వహించే దసరా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి కొడంగల్ చేరుకుంటారు.
మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3:30 గంటల వరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు, స్థానిక ప్రజలను నేరుగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారి సమస్యలు, వినతులను స్వీకరిస్తారు.
అనంతరం సాయంత్రం 4:00 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరుగుపయనమై రాజధాని హైదరాబాద్‌కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం, ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులతో పాటు మూడంచెల భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

