Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ వరదల్లో ఆ ఇల్లు ఎలా నిలబడింది..? ఇంటి యజమాని ఏమి చెప్పారంటే..?

నేపాల్ వరదల్లో ఆ ఇల్లు ఎలా నిలబడింది..? ఇంటి యజమాని ఏమి చెప్పారంటే..?

నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో త్రిశూలీ నదికి వచ్చిన భయంకరమైన వరదల్లో ప్రకాష్ అనే వ్యక్తికి చెందిన ఆకుపచ్చ రంగు ఇల్లు చెక్కుచెదరకుండా నిలబడింది.

చుట్టుపక్కల ఉన్న భవనాలు, వాహనాలు, వస్తువులు వరదలో కొట్టుకుపోయినప్పటికీ.. ఈ ఇల్లు మాత్రం సురక్షితంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

వరద నీరు పెరుగుతోందని తెలియగానే నా దుకాణం నుంచి వెంటనే ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చానని, ఇంట్లో నా కుటుంబ సభ్యులు ఐదుగురు ఉన్నారు. అందరినీ బయటికి రమ్మని పిలిచాను, కానీ అప్పటికే నీటి ఉధృతికి మా వాహనం పల్టీ కొట్టడం చూసి మళ్లీ అందరం వెనక్కి, ఇంట్లోకి వెళ్లిపోయాము. మా జీవితాలు ముగిసిపోతున్నాయేమో అనిపించిందని ప్రకాష్ అన్నారు. నీటి మట్టం పెరుగుతుండటంతో కుటుంబ సభ్యులంతా ముందుగా ఇంటి నాలుగో అంతస్తుకు, ఆ తర్వాత భవనం పైకప్పు మీదకు చేరుకున్నారు. వరద బీభత్సం సాగుతున్న సమయంలో, స్కూల్‌కు వెళ్లిన తన కుమారుడి పరిస్థితి ఏంటోనని తాను తీవ్ర ఆందోళనకు గురైనట్లు ప్రకాష్ చెప్పారు.

చుట్టుపక్కల భవనాలు కొట్టుకుపోయినా ఈ ఇల్లు సురక్షితంగా ఉండటానికి కారణం దాని నిర్మాణమేనని ఆయన తెలిపారు. ఇది సుమారు 40 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు. అప్పట్లో సిమెంట్, నిర్మాణ సామగ్రి నాణ్యత చాలా బాగుండేది. ఇల్లు నదికి దగ్గరగా ఉండటంతో పునాది బలంగా ఉండేందుకు ఖర్చుకు వెనుకాడలేదు. పునాది కింద రోడ్డు నిర్మాణానికి వాడే మెటీరియల్‌ను రెండు మూడు పొరలుగా వేశాము, అందుకే ఇల్లు అంత బలంగా నిలబడిందని ఆయన వివరించారు. ఇంటి కింది భాగాన్ని తన దుకాణానికి సంబంధించిన గోదాముగా వాడటం వల్ల.. అందులోని వస్తువులు, రెండు కార్లు, బైకులు, స్కూటర్లు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదలో సుమారు గంట నుంచి గంటన్నర పాటు ప్రాణ భయంతో చిక్కుకున్న తర్వాత నీటి మట్టం కాస్త తగ్గింది. అప్పుడు పక్కనే ఉన్న టోల్ ఏరియా స్థానికులు భవనాల మధ్య ఒక పైపును ఉంచి, దాని ద్వారా తాడు సహాయంతో ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu