Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు

మరావతి: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. నాలుగు విడతల్లో వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ మొదటి విడత కింద 1,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, విశ్వవిద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తోంది. రెండో విడతలో భర్తీ చేయనున్న 3,231 పోస్టుల్లో 149 గ్రూప్-1 ఉద్యోగాలు ఉండగా, మూడో విడతలో భర్తీ చేయనున్న 2,311 పోస్టుల్లో 673 గ్రూప్-2 ఉద్యోగాలు ఉన్నాయి.

ఇక అత్యధికంగా పాఠశాల విద్యలో ఉపాధ్యాయ, డీఈఓ, ఏడీ తదితర 2,991 పోస్టులను, అలాగే హోం శాఖలో 1,900కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు కారణంగా ఉగాది జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగాయి. ఆగస్టులో ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు సెప్టెంబరుకు మారాయి. దీంతో మూడు, నాల్గవ విడతల నోటిఫికేషన్లను ఒకేసారి అక్టోబరు 15న విడుదల చేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu