రాంచరణ్ నటించిన 'పెద్ది' సినిమాకు పైరసీ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా రిలీజ్‌కు ముందే ఇంటర్నెట్లో అన్ ఆఫీషియల్ లింక్స్ అప్లోడ్ చేయడం, థియేటర్లలో విడుదలైన వెంటనే పైరసీ కాపీలను వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, వెబ్సైట్లలో రిలీజ్ చేయడం వంటి అక్రమ చర్యలను అడ్డుకోవాలని కోరుతూ 'పెద్ది' చిత్ర నిర్మాత మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. నిర్మాత వాదనలతో ఏకీభవించింది. సినిమా హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, 'పెద్ది' చిత్రానికి 'యాంటీ-పైరసీ ఇంజంక్షన్' ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, పైరసీ వెబ్సైట్లు, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ సినిమా కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయడానికి వీల్లేదు. సినిమాకు సంబంధించిన ఎలాంటి అనధికారిక డౌన్లోడ్, స్ట్రీమింగ్ లింకులు కనిపించినా వాటిని తక్షణమే బ్లాక్ చేయాలని సైబర్ సెల్‌ను సైతం కోర్టు ఆదేశించింది.

