Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది'కి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్!

'పెద్ది'కి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్..టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్మాతల అభ్యర్థన మేరకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు మరియు ప్రత్యేక షోలకు అధికారికంగా అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ చిత్రానికి భారీ హైప్ ఉండటంతో విడుదల కంటే ఒక రోజు ముందే, అంటే జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రీమియర్ షోల కోసం గరిష్ఠ టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ఇక జూన్ 4న సినిమా విడుదలైన రోజు నుండి మొదటి పది రోజుల పాటు (జూన్ 13 వరకు) టికెట్ ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ ధరపై అదనంగా రూ.100, అలాగే మల్టీప్లెక్స్‌లలో అదనంగా రూ.125 చొప్పున పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. సినిమాకు ఉన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా థియేటర్లలో రోజుకు ఐదు ఆటలు (5 Shows) ప్రదర్శించేందుకు కూడా లైన్ క్లియర్ అయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu