Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వం తరుపున ఒక డిఫ్యూటీ సీఎంగా మీకు గౌరవం ఇస్తున్నాం.. మీ సమావేశం లక్ష్యం ఎవరి కోసం..?

ప్రభుత్వం తరుపున ఒక డిఫ్యూటీ సీఎంగా మీకు గౌరవం ఇస్తున్నాం.. మీ సమావేశం లక్ష్యం ఎవరి కోసం..?

తెలంగాణ ఆవిష్కరణ రోజు పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సభ కోసం ప్రభుత్వం ముందు అర్జీ పెట్టారు.. ప్రభుత్వం తిరస్కరించింది.. ఇంట్లో కూడా అనుమతి ఇవ్వమన్నారు..

ఇవ్వలేదని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా మీరున్నారు.. ప్రజల మధ్య వైర్యలు కుట్రకు తెరలేపుతున్నారు.. మోదీ, బీజేపీ పవన్ కళ్యాణ్‌ను బలి చెయ్యకండి.. పవన్‌కు రాజకీయం ఏమి తెలియదు.. బీజేపీకి అనుకూలంగా పవన్ మారారు.. చేగువేరా వారసుడిగా ఉండి హిందూ ధర్మాన్ని నమ్మడం ఏంటోనని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్‌తో వైరాలను పెంచాలని అనుకుంటున్నారు.. మోదీ, ఎన్డీఏ కూటమి ఓట్లతోని గెలుస్తారు.. బీజేపీకి పవన్ కళ్యాణ్ బూస్టర్.. పవన్ కళ్యాణ్‌ను పావుగా బీజేపీ వాడుతుందన్నారు. నెక్ట్స్‌ తెలంగాణ అంటే ఏమో అనుకున్న.. బీజేపీ వాళ్లకు ధాన్యం కొనమంటే చేతకాదు, నిధులు సైతం కేటాయించరు.. BRS అనుకూలమైన వాతావరణం తేవడానికి బీజేపీ పవన్‌తో ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ రాజేసి BRSని పెద్ద చెయ్యాలని చూస్తున్నారు.. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండడం మీకు ఇష్టం లేదా..? అని ప్రశ్నించారు.

తెలంగాణ వస్తే ఉపవాసం చేసిన అన్నావ్.. మొదట ఏపీని పాలించండి.. ఏపీ పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్ళమే తెలంగాణ వాళ్ళం.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత వాతావరణంకై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ నల్లికుట్లోల్ల లాగా పంచాయతీలు పెట్టి కూర్చుంటారు.. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉండు.. పట్టింపులేదా..? ఇలాంటి వ్యాఖ్యలకు కేసీఆర్ పరివారం కూడా స్పందించట్లేదన్నారు.

తెలంగాణ అమరవీరుల వద్ద ఎప్పుడైనా నివాళులర్పించారా పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నించారు.. తెలంగాణ మీద నిలువెల్ల బీజేపీ, ప్రధాని విషం కక్కుతున్నారు.. బీజేపీ ఎంపీలు పాకిస్తాన్‌తో పోలుస్తున్నారు.. తెలంగాణ బీజేపీ నేతలకు ఆత్మగౌరవం లేదన్నారు. తెలంగాణ ప్రజల మధ్య కొట్లాటలు పెట్టాలి.. ఆందోళనలు చెయ్యాలి.. నాకు రాజ్యపీఠం కావాలని బీజేపీ చేస్తుందన్నారు.

ప్రభుత్వం తరుపున ఒక ఉప ముఖ్యమంత్రిగా మీకు గౌరవం ఇస్తున్నాము.. కొండగట్టు యాత్రకు, వారాహి యాత్రకు అన్ని పర్మిషన్‌లు ఇచ్చాము.. మీ సమావేశం లక్ష్యం ఎవరి కోసం..? ఎందుకు కోసమో తెలుసుకోమన్నారు. తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి కొట్లాడిన ఉద్యమగడ్డ తెలంగాణ.. త్యాగాలను స్మరణం చేసుకోవాలి.. ఉద్యమకారులకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందన్నారు.

బీజేపీ ఇలాంటివి ప్రోత్సహించడం సరికాదన్నారు. పవన్‌ను తీసుకొచ్చి సెంటిమెంట్ రాజకీయం చెయ్యడం అంటే సరికాదు.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి జరగడానికే కేంద్రంతో సీఎం సఖ్యతగా ఉంటున్నారు.. ఒక నాయకుడు అందరితో సమన్వయంగా ఉండటం తప్పా..? అని ప్రశ్నించారు. మిత్రుడు పవన్ కళ్యాణ్.. బీజేపీ రాజకీయం చేసి వాడుకొని వదిలేయటం తెలుసు.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ మోసాలు చేస్తుంది.. బీజేపీ విష కౌగిలి వదిలి.. మీకు మీకుగా సిద్ధాంత పునాదులు ఏర్పాటు చేసుకొని రాజకీయం చేసుకోండని సూచించారు. మోదీ కలిసి వెళ్లిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu