Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధానికి మనం ఏమివ్వగలం : పవన్ కళ్యాణ్

ప్రధానికి మనం ఏమివ్వగలం : పవన్ కళ్యాణ్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

140 కోట్ల మంది భారతీయుల కలలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలుగుజాతి ఎవరికీ తలవంచదని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చాటిచెప్పారని గుర్తుచేసిన పవన్.. ఈ భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకుపోతోందని ప్రశంసించారు.

దేశ ప్రగతికి మౌలిక సదుపాయాల కల్పనే అత్యంత కీలకమని ప్రధాని మోదీ బలంగా విశ్వసిస్తారని, అందులో భాగంగానే రైల్వే జోన్ కేటాయించి ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారని పవన్ తెలిపారు. దేశాన్ని 'వికసిత్ భారత్' దిశగా మోదీ విజయవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే క్రమంలో అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధానికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆయనను కొందరు విమర్శించడం చూసి తాను చాలా బాధపడ్డానని తెలిపారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత వెనక్కి లాగే ప్రయత్నం చేసినా మోదీ ఎక్కడా భయపడలేదన్నారు. తనను దూషించిన వారిని సైతం క్షమించే గొప్ప గుణం ఆయన సొంతమన్నారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం దేశం కోసం పనిచేస్తున్న ప్రధానికి మనం ఏమివ్వగలం అని ప్రశ్నించిన పవన్.. ఇలాంటి నాయకుడు ప్రధానమంత్రిగా రావడం మనందరి అదృష్టమన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu