Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజలు వేసిన ప్రతి ఓటుకు న్యాయం చేస్తున్నాం : చంద్రబాబు

ప్రజలు వేసిన ప్రతి ఓటుకు న్యాయం చేస్తున్నాం : చంద్రబాబు

పేదల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ప్రజలు వేసిన ప్రతి ఓటుకు న్యాయం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

విజయవాడలో 707 ఎకరాల్లోని 34 లక్షల చదరపు గజాల స్థలాలకు పేదలకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ భూముల విలువ సుమారు రూ.28,112 కోట్లు ఉంటుందని తెలిపారు. ఒక్కో కుటుంబానికి సగటున 130 చదరపు గజాల స్థలం లభిస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 60 వేల మంది పేదలకు పట్టాలు ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.

గత పాలనలో భూముల విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే చేపట్టి భవిష్యత్‌లో భూ వివాదాలు లేకుండా కొత్త వ్యవస్థను తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు.

పేదలకు కల్పించిన భూములను భవిష్యత్ తరాల కోసం జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu