వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల చేరుకున్నారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో పర్యటించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద వైఎస్ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భాకరాపురం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బసచేస్తారు. రెండో తేదీ ఉదయం 7.45కు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు.

