ఆంధ్రప్రదేశ్ లోని తొమ్మిది జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది.
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన పిడుగుల వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అత్యవసర సూచనలు చేశారు. పిడుగులు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా ఓపెన్ షెడ్ల వద్ద నిలబడకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

