Dailyhunt
రంగారెడ్డిలో హిట్ అండ్ రన్ హర్రర్..కారు బోనెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్! (video)

రంగారెడ్డిలో హిట్ అండ్ రన్ హర్రర్..కారు బోనెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్! (video)

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత భయంకరమైన రోడ్ రేజ్ ఘటన చోటుచేసుకుంది. గాయత్రీ నగర్ నుండి ఎల్బీనగర్ వైపు బైక్‌పై వెళ్తున్న ఎస్‌కే జిలానీ, అతని కుమారుడు ఫైజల్‌ను వెనుక నుంచి వచ్చిన ఒక కారు బలంగా ఢీకొట్టింది.

ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం తీవ్ర దాడికి దారితీసింది. నిందితుడు కారుతో పారిపోవడానికి ప్రయత్నించగా, అతడిని అడ్డుకునే క్రమంలో జిలానీ కారు బోనెట్‌పైకి ఎక్కాడు. కిరాతకుడైన డ్రైవర్ ఏమాత్రం కనికరం లేకుండా జిలానీని బోనెట్‌పైనే సుమారు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లాడు.

బాలాపూర్ క్రాస్ రోడ్స్ వరకు అతివేగంతో వెళ్లిన కారు, తిరిగి మందమల్లమ్మ జంక్షన్ వద్దకు చేరుకున్న సమయంలో స్థానికులు గమనించి అడ్డుకున్నారు. దీనితో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫైజల్ ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బోనెట్‌పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu