Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాహితీవేత్తలకు బిగ్ అలర్ట్: తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలు-2026 ప్రకటన!

సాహితీవేత్తలకు బిగ్ అలర్ట్: తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలు-2026 ప్రకటన!

తెలంగాణ సాహిత్య అకాడమీ 2026 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మకమైన "రాష్ట్ర సాహిత్య అకాడమీ" పురస్కారాలను ప్రకటించింది. సాహిత్య రంగంలోని వివిధ ప్రక్రియలలో విశిష్ట ప్రతిభ కనబరిచి, అత్యుత్తమ గ్రంథాలను రచించిన ప్రముఖ రచయితలు మరియు పరిశోధకులకు ఈ అవార్డులను ప్రధానం చేయాలని అకాడమీ నిర్ణయించింది.

ఈ పురస్కారాల ఎంపికను ప్రధానంగా మూడు విభిన్న సాహిత్య ప్రక్రియలుగా వర్గీకరించారు. మొదటి వర్గంలో కథ, నవల మరియు నాటక విభాగాలు ఉండగా, రెండవ వర్గంలో అన్ని రకాల కవిత్వ రూపాలను చేర్చారు. ఇక మూడవ వర్గంలో సాహిత్య పరిశోధన మరియు విమర్శలకు సంబంధించిన గ్రంథాలను చేర్చారు. ఈ మూడు ప్రక్రియలకు చెందిన ఉత్తమ గ్రంథాలను విడివిడిగా పరిశీలించి పురస్కారాల కోసం ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎంపికైన ప్రతి పురస్కార గ్రహీతకు అధికారిక ప్రశంసాపత్రం, ప్రత్యేక జ్ఞాపికతో పాటు రూ. 1,01,116/- ల నగదు బహుమతిని అందజేస్తారు. ఈ అవార్డులకు సంబంధించిన పూర్తి దరఖాస్తు వివరాలు, నిబంధనలు మరియు చివరి తేదీకి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే ప్రముఖ పత్రికల ద్వారా విస్తృతంగా తెలియజేస్తామని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ప్రకటనలో తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu