Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం: పైనుంచి సర్వీస్ రోడ్డుపై పడ్డ సిమెంట్ లారీ!

శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం: పైనుంచి సర్వీస్ రోడ్డుపై పడ్డ సిమెంట్ లారీ!

హైదరాబాద్ శివారు శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై గురువారం ఉదయం తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ బస్తాల లోడుతో వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ఫ్లైఓవర్ పైనుంచి కింద ఉన్న సర్వీస్ రోడ్డు పొదల్లోకి పల్టీలు కొడుతూ పడిపోయింది.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు.

సూర్యాపేట జిల్లా కోదాడ నుంచి మహారాష్ట్రలోని తుల్జాపూర్ వైపు TG29T3688 రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీ సిమెంట్ లోడుతో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపుతప్పి రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టి, ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ప్రమాదంపై 'డయల్ 100' ద్వారా సమాచారం అందుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన 40 ఏళ్ల డ్రైవర్ ఇల్లయ్యను పెట్రోలింగ్ వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన సిమెంట్ బస్తాలు, లారీ శకలాలను పోలీసులు క్రేన్ల సాయంతో తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu