Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సిడ్నీ మేయర్‌గా తెలంగాణ మహిళ.. ఎవరీ సంధ్యా రెడ్డి?

సిడ్నీ మేయర్‌గా తెలంగాణ మహిళ.. ఎవరీ సంధ్యా రెడ్డి?

తెలంగాణ మట్టి బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన సంధ్యా రెడ్డి (శాండీ రెడ్డి) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల ప్రతిష్టాత్మక స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

మంగళవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో తోటి కౌన్సిలర్ల పూర్తి మద్దతుతో ఆమె ఈ అత్యున్నత పదవికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆమె సెప్టెంబర్ 2028 వరకు మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

వికారాబాద్ టు ఆస్ట్రేలియా.. స్ఫూర్తిదాయక ప్రస్థానం:

సంధ్యా రెడ్డి స్వస్థలం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం మల్లారెడ్డిగూడెం. ఆమె హైదరాబాద్‌లోని స్టాన్లీ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం (లా) అభ్యసించారు. అనంతరం ఉన్నత అవకాశాల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె, అక్కడ ఇమ్మిగ్రేషన్ లాయర్‌గా వృత్తిని ప్రారంభించారు. న్యాయవాదిగా స్థిరపడుతూనే స్థానిక సమాజ సేవల్లో, పౌర సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొని విశేష ఆదరణ పొందారు.

అంచెలంచెలుగా మేయర్ పీఠానికి:

2021లో తొలిసారిగా స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిలర్‌గా ఎన్నికై స్థానిక రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధించి తన పట్టును నిరూపించుకున్నారు. అనంతరం సెప్టెంబర్ 2023లో స్ట్రాత్‌ఫీల్డ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై, ఆ పదవిని చేపట్టిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 2025లో మరోసారి డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన సంధ్యా రెడ్డి.. ఇప్పుడు కౌన్సిలర్ల మద్దతుతో అత్యున్నతమైన మేయర్ పీఠాన్ని అధిరోహించారు. కౌన్సిలర్ నుంచి డిప్యూటీ మేయర్, ఇప్పుడు మేయర్‌గా ఎదిగిన ఆమె ప్రస్థానం ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణంగా నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu