Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'తల్లికి వందనం' స్కీమ్‌.. ఇలా చేస్తేనే ఖాతాల్లోకి రూ.13,000

'తల్లికి వందనం' స్కీమ్‌.. ఇలా చేస్తేనే ఖాతాల్లోకి రూ.13,000

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించిన నిధుల విడుదల తేదీలు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించబోయే మెగా పీటీఎం (తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం) సందర్భంగా అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది.

ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఏటా రూ.13,000 ఆర్థిక సహాయం జమ చేయనుంది. అయితే ఈ పథకానికి తాము అర్హులా కాదా అనే విషయాన్ని లబ్ధిదారులు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.

అర్హతను తనిఖీ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్:

https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout

లబ్ధిదారులకు ముఖ్య గమనిక (ఆధార్, ఈ-కేవైసీ తప్పనిసరి):

ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లోనే ఈ నిధులు జమ కానున్నాయి. కాబట్టి లబ్ధిదారులు ఈ కింది వివరాలను ఒకసారి పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు:

ఆధార్ అనుసంధానం: అర్హులైన వారికి నిధులు సజావుగా జమ కావాలంటే లబ్ధిదారుల ఆధార్ సంఖ్య తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉండాలి.

ఈ-కేవైసీ: ఇంకా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే తమ వివరాలను పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు:

'తల్లికి వందనం' పథకం వర్తించాలంటే కుటుంబానికి ఈ కింది అర్హతలు ఉండాలి:

ఆదాయపు పన్ను: కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండకూడదు.

ఉద్యోగం/పెన్షన్: ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తించదు.

భూమి పరిమితి: కుటుంబానికి 10 ఎకరాల లోపు మెట్ట భూమి లేదా 5 ఎకరాల లోపు మాగాణి భూమి మాత్రమే ఉండాలి.

విద్యుత్ వినియోగం: లబ్ధిదారుల కుటుంబం యొక్క గత 12 నెలల విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల లోపు ఉండాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu