Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్: టీవీకే గూటికి కాంగ్రెస్, వామపక్షాలు?

తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్: టీవీకే గూటికి కాంగ్రెస్, వామపక్షాలు?

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 234 స్థానాలకు గాను 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ (118) కు పది సీట్ల దూరంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో, అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి విజయ్ ఇప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఇతర చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ప్రస్తుతం డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA)లో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్ (5 సీట్లు), వీసీకే (2), సీపీఐ (2), సీపీఐ (ఎం) (2), ఐయూఎంఎల్ (2) పార్టీలను తమ వైపు తిప్పుకోవాలని టీవీకే భావిస్తోంది. ఈ పార్టీలు గనుక విజయ్‌కు మద్దతు ఇస్తే, టీవీకే కూటమి బలం సులభంగా మెజారిటీ మార్కును దాటుతుంది. సుమారు మూడు దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని చెరిపివేస్తూ, తొలి ఎన్నికల్లోనే టీవీకే దాదాపు 35 శాతం ఓట్ల వాటాను సాధించడం విశేషం. ఈ క్రమంలో ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాకు పడిపోయింది.

మరోవైపు టీవీకేతో జతకట్టే విషయంపై కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. తమిళనాడు ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సామూహిక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ శశికాంత సెంథిల్ పేర్కొన్నారు. నిన్నటి వరకు డీఎంకేతో ఉన్న బంధంపై ఆయన క్లారిటీ ఇస్తూనే, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు. పార్టీ అధిష్టానం ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఫిబ్రవరి 2024లో పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అధికారం చేపట్టే దిశగా విజయ్ అడుగులు వేయడం భారత రాజకీయాల్లో ఒక అరుదైన మైలురాయిగా నిలవనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu