తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి దూరమవుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో ఆయన భేటీ అయ్యారు.
తాను సొంత రాజకీయ మార్గంలో ముందుకు సాగాలనుకుంటున్నట్లు అన్నామలై పార్టీ అధిష్టానానికి స్పష్టం చేశారు. అయితే ఆయనను బీజేపీలోనే కొనసాగించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న 'వీ ది లీడర్స్' సంస్థ భవిష్యత్ లో కీలకపాత్ర పోషించనుంది.

