హైదరాబాద్, అమరావతి నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో రెండు రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తూ, తెలుగు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు కోరారు.

