Thursday, 03 Dec, 9.21 am News Meter తెలుగు

తెలంగాణ
తెలంగాణలో కొత్తగా 609 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 609 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,71,492 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1465 మంది మృతి చెందారు. తాజాగా కోలుకున్నవారి సంఖ్య 873 మంది ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,61,028 మంది ఉన్నారు. మొత్తం యాక్టివ్‌ కేసులు 8,999 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 6,922 మంది చికిత్స పొందుతున్నారు.

తాజాగా జీహెచ్‌ఎంసీలో 114 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మల్కాజిగిరి 45, రంగారెడ్డి 48 పాజిటివ్‌ కేసులునమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu
Top