హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు కీలక నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, సొసైటీలకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 18 కార్పొరేషన్లకు చైర్మన్లను ఖరారు చేయడంతో పాటు, గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌కు చైర్మన్, సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది.
1. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్- బస్వరాజు శ్రీనివాస్
2. వాషర్‌మెన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ - దాసరిరాజు అజయ్ కుమార్
3. గీతకార్మికుల కార్పొరేషన్ - మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్
4. పెరిక సహకార కార్పొరేషన్ - దొంగారి వెంకటేశ్వర్లు
5. మేర సహకార కార్పొరేషన్ - సంగా వెంకటరాజం
6. వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ - గట్టు తిమ్మప్ప
7. మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ - బొమ్మ శ్రీరామ్
8. యాదవ సహకార కార్పొరేషన్ - ఎం.రఘునాథ్ యాదవ్
9. వడ్డెర సహకార కార్పొరేషన్ - గుంజ రేణుక నారాయణ
10. చేనేత అభివృద్ధి కార్పొరేషన్ - దూదెం వెంకటరమణ
11. కమ్మ కార్పొరేషన్ - బండి రమేష్
12. పద్మశాలి సహకార కార్పొరేషన్ - గూడురు శ్రీనివాస్
13. భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ - సీహెచ్ బాలరాజు
14. వెలమ కార్పొరేషన్ - జువ్వాది నర్సింగ్‌రావు
15. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ - కొల్లె సరిత
16. లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ - చరణ్ కౌశిక్ యాదవ్
17. తెలంగాణ తెలుగు అకాడమీ - ప్రొ.వెంకటనారాయణ
18. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్ - సూదిని రామిరెడ్డి
తెలంగాణ గ్రామపంచాయతీ ట్రైబ్యునల్ సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్, బూసా వేణుగోపాల్‌ను ప్రభుత్వం నియమించింది.

