Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో భయపెట్టిన భారీ పాము

తిరుమలలో భయపెట్టిన భారీ పాము

తిరుమల లో ఓ పెద్ద పాము భక్తులను భయపెట్టింది. అది జెర్రిపోతు అని అధికారులు తెలిపారు. వకుళమాత అతిథి గృహం వద్ద ఈ జెర్రిపోతు కనిపించింది. తొమ్మిది అడుగుల పొడవు ఉన్న ఈ పామును చూసిన శ్రీవారి భక్తులు, సిబ్బంది సహాయంతో టీటీడీ మాజీ ఉద్యోగి భాస్కర్‌ నాయుడుకు సమాచారమిచ్చారు.

ఆయన ఆ పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తులను ఆకట్టుకునేలా తిరుమల క్షేత్రాన్ని విద్యుత్‌, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దసరా సెలవులతోపాటు పెరటాశి మాసం చివరి వారం కావడంతో ఈ బ్రహ్మోత్సవానికి భక్తులు భారీగా వస్తారనే అంచనాతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu