భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన లింక్డ్‌ఇన్‌లో తీవ్ర భావోద్వేగంతో కూడిన ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.
2008లో తనకు లభించిన ₹3.2 కోట్ల విలువైన తొలి ఐపీఎల్ కాంట్రాక్ట్ తనను మానసికంగా పూర్తిగా కుంగదీసిందని ఆయన వెల్లడించారు.
తన 21-22 ఏళ్ల వయసులో తన కుటుంబంలోని అనేక తరాలు కలిసి సంపాదించిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని (₹3.2 కోట్లు) పొందినట్లు ఉతప్ప చెప్పారు. అంత పెద్ద మొత్తాన్ని ఎలా దాచాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో సరైన సలహా ఇచ్చే వారు నా చుట్టూ ఎవరూ లేరు. డబ్బు ఒక్కసారిగా చేతికి రావడంతో నేను తీసుకునే నిర్ణయాలు, ఇతరులతో నాకున్న సంబంధాలు మారిపోయాయి. 2009 నాటికి నేను తీవ్రమైన (క్లినికల్) డిప్రెషన్ బారిన పడ్డారు.
దక్షిణాఫ్రికాలోని ఒక హోటల్‌లో 23వ అంతస్తు గది కిటికీ అంచున కూర్చుని ఉన్నప్పుడు తాను ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించాను. ఆ సమయంలో కోట్లలో ఉన్న నా సంపాదనకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది. నేటి యువ క్రీడాకారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలకు ఉతప్ప ఒక ముఖ్యమైన పాఠాన్ని అందించారు: డబ్బు అనేది మీ విజయం కాదు.. అది నిజానికి మీకో పరీక్ష అని పేర్కొన్నాడు.
నాకు 2008లో మొదటి ఐపీఎల్ ఒప్పందం లభించింది. అప్పుడు నా వయసు కేవలం 21 ఏళ్లు. అంత భారీ మొత్తాన్ని నేను ఎప్పుడూ ఊహించలేదు—30 ఏళ్ల వయసుకు గానీ, 40 ఏళ్ల వయసుకు గానీ, అసలు ఎప్పుడూ కూడా.. ఈరోజు, అకస్మాత్తుగా గొప్ప విజయాన్ని లేదా సంపదను సాధించిన ప్రతి యువ క్రీడాకారుడిని, పారిశ్రామికవేత్తను, లేదా స్టార్టప్ వ్యవస్థాపకుడిని ఉద్దేశించి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. చాలా డబ్బు వచ్చినప్పుడు, దానితో పాటు చాలా మంది కూడా వస్తారు. మీ మనసులో లక్షలాది ఆలోచనలు వెల్లువెత్తుతాయి. ఆ ఆలోచనలు లెక్కలేనన్ని సమస్యలకు దారితీస్తాయి. ఈ సమస్యలు సంభాషణలో అపార్థాలకు దారితీసి, చివరికి మిమ్మల్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయని పేర్కొన్నాడు.

