Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Video: చీరకట్టులో, చెప్పులు లేకుండా పరుగు.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి!

Video: చీరకట్టులో, చెప్పులు లేకుండా పరుగు.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి!

హారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 47 ఏళ్ల మహిళ తన అంకితభావంతో అందరినీ అబ్బురపరిచారు. భర్త మరణం తర్వాత ఇద్దరు కుమార్తెలను చదివించేందుకు ఆమె పడుతున్న కష్టాలు, మారథాన్‌లో చెప్పులు లేకుండా పరిగెత్తి ప్రథమ స్థానం సాధించిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంబజోగైకి చెందిన రమాబాయ్ రణ్‌వీర్ అనే మహిళ స్థానిక అకాడమీలో వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించడంతో, ఆ కుటుంబ బాధ్యతంతా ఆమెపైనే పడింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ తన ఇద్దరు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించాలనే గట్టి పట్టుదలతో ఆమె ముందుకు సాగుతున్నారు.

కూతుళ్ల చదువుకు ఆర్థికంగా సహకరించేందుకు రమాబాయ్ అంబజోగైలోని ఒక అకాడమీలో వంటమనిషిగా చేరారు. ఆమె పెద్ద కూతురు పూజను అదే అకాడమీలో చేర్పించారు. అక్కడ విద్యార్థులకు వంట చేస్తూనే, కూతుళ్ల చదువును దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థ ఆధ్వర్యంలో 'అమృత్ దౌడ్' పేరిట మారథాన్ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో విజేతకు రూ. 3,000 నగదు బహుమతి ప్రకటించడంతో, రమాబాయ్ కూడా ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ట్రాక్‌ సూట్లు ధరించిన యువతుల మధ్య సాధారణ చీరకట్టులో రమాబాయ్ బరిలోకి దిగారు.

పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆమె వేసుకున్న చెప్పులు జారిపోతుండటంతో, ఆమె వాటిని చేతిలో పట్టుకుని చెప్పులు లేకుండానే కేవలం ఒట్టి కాళ్లతో పరుగులు తీశారు. రాళ్లను లెక్కచేయకుండా, చీరను సర్దుకుంటూ ఇతర పోటీదారులను వెనక్కి నెడుతూ ఆమె ముందుకు దూసుకెళ్లారు. చివరకు లక్ష్య్యాన్ని చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచారు. ఆమె పట్టుదలను చూసి అక్కడున్న ప్రేక్షకులు కేరింతలు కొడుతూ అభినందించారు. తన కూతురు పూజ కూడా ఈ మారథాన్‌లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలవడం విశేషం.

విజయం సాధించిన తర్వాత రమాబాయ్ మాట్లాడుతూ.. తన కళ్ల ముందు కూతుళ్ల భవిష్యత్తు మెదలుతూనే ఉందని, బహుమతిగా వచ్చే మూడు వేల రూపాయలతో వారి చదువుకు కావలసిన పుస్తకాలు కొనుగోలు చేస్తానని తెలిపారు. పూజ ప్రస్తుతం పోలీస్ ఉద్యోగానికి సన్నద్ధమవుతుండగా, మరో కూతురు బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కష్టాలను లెక్కచేయకుండా తల్లి పడుతున్న శ్రమను చూసి పూజ గర్వపడుతోంది. కేవలం ఒక పరుగు మాత్రమే కాకుండా, తల్లిగా తన బిడ్డల భవిష్యత్తు కోసం ఆమె చేసిన ఈ సాహసయాత్ర ఎందరికో స్పూర్తిగా నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu