Thursday, 03 Dec, 9.57 am NewsSting

తెలుగు హోం
బాప్ రే.. పవన్ వలన కాపులకు వంద కోట్ల నష్టమా?

కొన్ని కొన్ని అంతే. లేట్ గా అయినా లేటెస్ట్ గా తెలుస్తుంటయ్. పిప్పర్ మెంట్ లాంటి ఈ న్యూస్ కూడా అలాంటిదే. జనసేన అధినేత, మెగాస్టార్ ముద్దుల తమ్ముడు.. కోట్ల మంది భక్తులకు దేవుడు.. జనసేన అధినేత, కాపు సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వల్ల.. అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి వంద కోట్ల నష్టం వచ్చిందంట. కన్ ఫ్యూజనేం లేదు. అక్షరాల వంద కోట్లు నష్టం వచ్చిందంట.కాకపోతే ఇదంతా అఫీషియల్ కాదు. అనఫీషియల్ గా జరిగింది. గాజువాకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేశారు కదా. ఆ టైంలో.. ఆయన మీటింగ్ కి లీడర్లు కేడర్లు అంతా వచ్చారట. వైసీపీ తరపున తిప్పల నాగిరెడ్డి పోటీ చేశారు. జగన్ పెట్టిన మీటింగ్ కి వచ్చిన వారిలో పవర్ స్టార్ పెట్టిన మీటింగ్ కి ..సగం మంది కూడా రాలేదట. అప్పుడే పవన్ ఓడిపోతారు అని వైసీపీ ఫిక్స్ అయిందంట.కానీ.. పవర్ స్టార్ వీరాభిమానులు.. హోటల్స్ లో దిగి..

గాజువాక మొత్తం ప్రచారం చేశారట. కానీ.. మూడు రోజుల ముందే పవన్ ఓడిపోతారని తెలిసి.. హోటల్స్ కూడా ఖాళీ చేశారట.

అయినా సరే.. ఈస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం కాపులు వర్సెస్ రాజుల మధ్య బెట్టింగ్ ఫుల్లుగా జరిగిందంట. తిప్పల నాగిరెడ్డి గెలుస్తారని.. రాజులు వంద కోట్ల దాకా బెట్టింగ్ వేస్తే..

మా దేవుడు పవర్ స్టార్ పవన్ కల్యాణే గెలుస్తారు అని.. కాపులు కూడా వంద కోట్లు బెట్టింగ్ వేశారట.ఫైనల్ గా పవన్ కల్యాణ్ పై తిప్పల నాగిరెడ్డి.. ఏకంగా 16 వేల మెజార్టీతో గెలిచారు. ఇంకేముంది..

పవన్ కల్యాణ్ ఓడిపోయారనే బాధతో పాటు.. వంద కోట్లు నష్టపోయాం అనే బాధ కూడా తప్పలేదట. ఆ విషయం రీసెంట్ గా తిప్పల నాగిరెడ్డి స్వయంగా చెప్పారు. తన ఫ్రెండ్స్ ఈస్ట్ గోదావరి నుంచి ఫోన్ చేసి..

పవన్ కల్యాణ్ పై బెట్టింగ్ వేసిన వాళ్లు వంద కోట్లు నష్టపోయారు. మీపై బెట్టింగ్ వేసి.. వంద కోట్లు గెలుచుకున్నాం అన్నారట. ఇది చదవండి: పోలవరంపై జనసేనాని తీరేంటి ఇలా ఉంది

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top