Wednesday, 05 Aug, 10.32 am NewsSting

జాతీయ వార్తలు
భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

అమెరికాలో ఉద్యోగాలపై ఆశలు చావని భారతీయులపై మరో పిడుగుపాటు పడింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. మరీ ముఖ్యంగా హెచ్‌1బీ వీసాదారులకు ఫెడరల్‌ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ సంస్థలు నాలుగు నెలల్లోగా అంతర్గత ఆడిటింగ్‌ పూర్తి చేసుకుని, ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే మానవ వనరులు ఉండేలా చూసుకోవాలిని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి వరకు హెచ్‌ 1బీ వీసాలతో పాటు పలు ఇతర వర్క్‌ వీసాలను నిలిపేస్తూ ఇప్పటికే యూఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్న స్వదేశీయులకు ఊరట కల్పించే దిశగా ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.అమెరికన్లకే ఉద్యోగాలు అనే సింపుల్‌ సిద్ధాంతాన్నే ఈ ప్రభుత్వం ఆచరిస్తుంది. అందుకు సంబంధించిన ఒక ఉత్తర్వుపై ఈ రోజు సంతకం చేయబోతున్నాను. చవకగా లభించే విదేశీ ఉద్యోగి కోసం కష్టపడి పనిచేసే అమెరికన్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని నా ప్రభుత్వం సహించబోదు. అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించే అత్యున్నత నైపుణ్యాలు కలిగిన విదేశీయులకు మాత్రమే హెచ్‌1బీ వీసాలు..

అంతేకాని అమెరికన్ల ఉద్యోగాలు లాక్కొనే వారికి కాదు' అని ట్రంప్‌ పేర్కొన్నారు. స్పష్టం చేశారు. త్వరలో కొత్త ఇమిగ్రేషన్‌ బిల్లుపై చర్చించబోతున్నాం. అది చాలా సమగ్రంగా ఉండబోతోందని ట్రంప్‌ ప్రకటించారు.

ఆంక్షల వల్ల అమెరికాకే తీవ్ర నష్టం.. నాస్కామ్ అమెరికా ప్రభుత్వ సంస్థలు విదేశీ ఉద్యోగులను, ముఖ్యంగా హెచ్‌-1బీ వీసాలపై ఉన్నవారిని తీసుకోకుండా నిరోధించేలా ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేయడం పూర్తి అపోహలకు, తప్పుడు సమాచారంతో తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తోందని భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వ్యాఖ్యానించింది. కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్న తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా కోలుకోవడానికి ప్రతిభావంతుల లభ్యత చాలా కీలకమని పేర్కొంది. ఇలాంటి వారిపై ఆంక్షలు విధిస్తే అమెరికా ఎకానమీ, ఉద్యోగాలు, నవకల్పనలు, పరిశోధన ..

అభివృద్ధి కార్యకలాపాల రికవరీ దశ మందగించే అవకాశం ఉందని నాస్కామ్‌ పేర్కొంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, లెక్కలు (స్టెమ్‌) నైపుణ్యాలు గల వారి కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. అమెరికాలో ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధోరణులు భారత ఐటీ సంస్థలకు సమస్యగా మారుతున్నాయి. అమెరికన్లకు ఉద్యోగాలు అనేదానికి తాము కట్టుబడి ఉన్నామని, చవకైన విదేశీ ఉద్యోగుల పేరుతో అమెరికన్లకు నష్టం జరుగుతోంటే తమ ప్రభుత్వం సహించదని స్పష్టం చేస్తూ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ ఐటీ రంగానికి దెబ్బేనని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు.

నిపుణులైన అమెరికన్ల స్థానంలో 'చౌక'గా పనిచేసే విదేశీ సిబ్బందిని తాము అనుమతించమని తెలిపారు. హెచ్1బీ వీసాల ను అత్యున్నత నైపుణ్యమున్న అమెరికా సిబ్బందికి వర్తింపజేస్తామన్నారు. తద్వారా అమెరికన్ పౌరులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఎంపిక చేయడం ముఖ్యంగా మహమ్మారి సంక్షోభ సమయంలో నష్టదాయకమని ఇది ఇప్పటికే మిలియన్ల మంది అమెరికన్లు ఉద్యోగాలను నష్టపోయారని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top