Wednesday, 27 Jan, 6.02 pm NewsSting

తెలుగు హోం
బీజేపీ-జనసేనకి అగ్నిపరీక్ష

అవును నిజమే. ఇది అంతకు మించి ఉండబోతుంది. ఇక్కడ తేడా కొట్టిందంటే మొత్తం బిస్కెట్టే. మరి ఆ అగ్ని పరీక్ష ఏంటంటే.. ఇంకేముంది పంచాయితీ ఎన్నికలే. పంచాయితీ ఎన్నికల ఎవ్వారంలో ఇంత వరకు ఏ పార్టీకీ క్లారిటీ లేదు. అసలు బీజేపీ, జనసేనలు పంచాయితీ ఎన్నికలకు ప్రిపేర్ అయ్యాయో లేదో కూడా ఎవరికీ క్లారిటీ లేదు. అసలు ఆ పార్టీ లీడర్లు అయినా ప్రిపేర్ అయ్యారా అంటే.. వాళ్లకీ డౌటే ఉండి ఉండొచ్చు కూడానూ. తిరుపతి ఎంపీ సీటు కోసం బీజేపీ, జనసేనలు ఏ రేంజ్ లో ఫైట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా.. నిమ్మగడ్డ రమేశ్, సీఎం జగన్ ఇటు సైడ్ ఫైట్ చేస్తుంటే.. ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం బీజేపీ, జనసేనలు.. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలూ నూరుకున్నారు. ఇప్పుడు మొదలైంది అసలు సమస్య. బ్యాడ్ లక్ ఏంటంటే.. ఇక్కడ టైం కూడా లేదు.

మరి ఏం చేస్తారు ఏంటి అన్న విషయంలో రెండు పార్టీలకీ క్లారిటీ లేనట్లే ఉంది. కలిసి పోటీ చేయాలి అంటే.. ఇప్పటికే మీటింగ్ లు గట్రా అయిపోయవాలి. పార్టీ అధ్యక్షులు అయినా కూర్చుని..

ఏం చేద్దాం అని మాట్లాడుకుని ఉండాలి. అందరం కలిసి.. ఒకటో రెండో వార్డు మెంబర్లు అయినా గెలిచి తీరాలి. కుదిరితే ఓ సర్పంచ్ సీటు అయినా గెలుస్తాం అని మాట్లాడాలి.

కానీ.. ఒక్క మాటా లేదు. ఇటు ప్రతి పక్షంలో ఉన్న టీడీపీ మాత్రం దూకుడుగానే ఉంది. పంచాయితీ ఎన్నికల్లో పవర్ చూపిస్తాం..

మేమేంటో వైసీపీకి తెలిసేలా చేస్తాం అంటున్నారు. ఆ లెక్కలోనే ముందుకు నడుస్తోంది టీడీపీ. కానీ.. టీడీపీ కంటే మేమే హై కి వెళ్తాం అంటున్న బీజేపీ కానీ..

తిరుపతి సీటు విషయంలో ఫైటింగ్ కి దిగిన జనసేన కానీ.. గప్ చుప్ గా ఉండిపోయాయి. అసలు లీడర్లే లేరు.. కేడర్ ఇంకెక్కడిది అనే విషయంలో వారికి కూడా క్లారిటీ ఉన్నట్లే ఉంది.

ఓ ఊరిలో ఒక వంద ఓట్లు అయినా పడతాయి అనే క్లారిటీ ఉంటేనే.. వార్డు మెంబర్ గా పోటీ చేసి.. ఆయా పార్టీలు దూకుడు గా ఉంటాయి.కానీ.. బీజేపీకి, జనసేనకీ రెండు పార్టీలకీ అంత సీన్ లేదు..

పోటీ మొత్తం వైసీపీ, టీడీపీ మధ్యనే అనే విషయం గ్రౌండ్ లెవల్లో క్లియర్ గా ఉంది. మరి ఏపీ మొత్తం వదిలేస్తే.. తిరుపతి ఎంపీ నియోజకవర్గంలో.. ఎన్ని వార్డు మెంబర్లు గెలుస్తారు..

ఎన్ని ఉప సర్పంచులు గెలుస్తారు.. ఎన్ని సర్పంచ్ పదవులు గెలుస్తారు అంటే మాత్రం.. అది మిలియన్ డాలర్ల ప్రశ్నే. యాక్చువల్ గా అయితే..

రెండు పార్టీలకీ.. తిరుపతి సీటు విషయంలో ఇది మంచి ఆప్షనే. మేం అన్ని వార్డు మెంబర్లు గెలిచాం.. ఇన్ని సర్పంచ్ పదవులు గెలిచాం అంటూ..

బలం చూపించి.. తిరుపతి సీటు విషయంలో డిమాండ్ చేసుకోవచ్చు. కానీ..అది జరుగుతుంది అనుకోవడం భ్రమే కావచ్చు. ఏపీ బీజేపీ కొత్త ప్లాన్.. వైసీపీకి చెక్ పెట్టే స్కెచ్

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top