Wednesday, 27 Jan, 5.05 pm NewsSting

తెలుగు హోం
డబుల్ డిజిట్ వృద్ధి భారత్‌కే సాధ్యం.. ఐఎమ్ఎఫ్ అంచనా

కరోనా నేపథ్యంలో చైనాతోసహా ఇతర ప్రపంచ దేశాలన్నీ సింగిల్ డిజట్ వృద్ధి రేటుకు పరిమితం కానుండగా భారతదేశం మాత్రమే 11.5 శాతం వృద్ధి రేటును సాధించనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. తాజాగా ఐఎమ్ఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ అప్‌డేట్‌ ప్రకారం 2021లో చైనా 8.1 శాతం వృద్దిరేటును సాధించనుండగా, స్పెయిన్ 5.9 శాతం, ఫ్రాన్స్ 5.5 శాతం వృద్దిరేటును మాత్రమే నమోదు చేస్తాయని తెలుస్తోంది.అంటే 2021లో డబుల్ డిజిట్ వృద్ధి సాధించే ఏకైక దేశం భారతదేశమేనని ఐఎమ్ఎఫ్ చెబుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని అందుకే గతంలో తాను అంచనా వేసిన 8.8 శాతం వృద్ధికంటే అధికంగా బారత్ 11.5 శాతం వృద్ది రేటును నమోదు చేయనుందని ఐఎమ్ఎప్ అంచనా వేసింది. 2020లో ప్రపంచం మొత్తం మీద 2.3 శాతం వృద్దిరేటును నమోదు చేసిన చైనా 2022 నాటికి 5.6 శాతం వృద్ధి రేటును మాత్రమే చేరుకోగలదని ఐఎమ్ఎఫ్ అంచనా. గత సంవత్సరం అక్టోబర్‌లో ఐఎమ్ఎఫ్ వేసిన అంచనా ప్రకారం భారత్ జీడీపీ రేటు 8.8 శాతంగా ఉండగలదని తేలింది. ఇది ప్రపంచంలోనే అత్యంత అధిక వృద్ధి రేటు. కానీ తన అంచనాను దాటి భారత్ 10.3 శాతం వృద్ది రేటును సాధించిందని ఐఎమ్ఎఫ్ కితాబిచ్చింది. బడ్జెట్ 2021 : ఇ-కామర్స్ ఎగుమతి దిగుమతులకు ప్రోత్సాహం వాస్తవానికి గత సంవత్సరం పొడవునా కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ సాహసోపేతమైన, నిర్ణయాత్మకమైన చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఆర్థిక పర్యవసానాలను కూడా అదే స్థాయిలో లెక్కించి భారత్ సత్వర చర్యలు తీసుకుందని ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది.కరోనా కష్టకాలంలోనూ భారత్‌లో పాలసీపరమైన మద్దతుతో కూడిన పరివర్తన చక్కగా పనిచేసిందని ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జెవా చెప్పారు. మొబైలిటీ సూచికలను చూసినట్లయితే, కోవిడ్‌కి ముందు భారత్‌లో ఏ పరిస్థితిని మనం చూశామో కోవిడ్ కాలంలోనో అదే పరిస్థితులను మనం చూశాం. అంటే భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పుంజుకున్నాయన్నమాట అని జార్జియేవా పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top