Wednesday, 27 Jan, 5.31 pm NewsSting

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఏంది బొత్స సార్.. కొడుకు వస్తున్నాడట కదా

మినిస్టర్ బొత్స సత్యనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ గా పరిచయాలతో పనేం లేదు. ఏ లీడర్ కి అయినా.. పార్టీలో తనకంటూ ఓ వర్గం ఉంటుంది. ఓ జట్టు ఉంటుంది. కానీ.. బొత్సకి మాత్రం ఫ్యామిలీ ఫ్యామిలీనే ఉంటుంది. ఎందుకంటే.. తన భార్య, తన తమ్ముడు, తన రిలేటివ్.. ఇలా అందరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. తల ఓ సీటు ఇప్పించి.. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించుకోవడం బొత్స స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. ఉత్తరాంధ్ర మొత్తం నాదే అంటారు మినిస్టర్ బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ఇంకో లీడర్ తన ఫ్యామిలీ నుంచి రాబోతున్నారు. తనే.. బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్. సందీప్ కూడా ఇప్పుడు.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అంతా రెడీ అవుతోందంట. ఎమ్మెల్యేగా గెలిపించుకుని.. తన వారసుడ్ని రాజకీయంలో తిరుగులేని లీడర్ గా చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట బొత్స సత్యనారాయణ. బొత్స కొడుకు ప్రస్తుతానికి డాక్టర్. అది కూడా ప్రజాసేవే.

ప్రాణాలు కాపాడే పొజిషన్ లో నుంచి.. ఇంకా పై పొజిషన్ కి తీసుకెళ్లి వ్యవస్థల్నే కాపాడే పొజిషన్ లో నుంచోబెట్టాలి అనే అత్యంత మధురమైన పాలిటిక్స్ చేయించడానికి రెడీ అవుతున్నారట బొత్స సత్యనారాయణ. పొలిటికల్ గా ఉండే పవర్ ఏంటో తనకి తెలిసిందే కదా. తను ఆల్రెడీ పెద్దాయన అయిపోయారు కాబట్టి..

ఇప్పుడైతే మంచి పవర్ ఉంది కాబట్టి.. ఇదే టైంలో.. కుమారుడి ఎంట్రీ కరెక్ట్ అనుకుంటున్నారట బొత్స సత్యానారాయణ.ఇంకెందుకు ఆలస్యం అనుకుంటున్న బొత్స.. ఆల్రెడీ నియోజకవర్గంలో..

తన కేడర్ మొత్తానికి సందీప్ ని పరిచయం చేస్తూ.. మీరేం చేస్తారో నాకు తెలీదు.. మావాడు పెద్ద లీడరై పోవాలి.. మీదే బాధ్యత అంటూ..

ప్రతి లీడర్ కీ ఇండి విడ్యువల్ గా చెబుతున్నారట. వచ్చే ఎన్నికల్లోగా యూత్ ఐకాన్ అయిపోవాలి. మావాడికి పాలిటిక్స్ లో ఉన్న మంచి చెడు.. లోపాలు..

ప్రలోభాలు అన్నీటిపైనా అవగాహన రావాలి అంటున్నారట. ఇకపై ఏ ప్లాన్ చేసినా.. నా కుమారుడు హైలైట్ అవుతుండాలి అంటూ చెబుతున్నారట బొత్స. అటు లోకల్ గా ప్లాన్ చేస్తూనే..

ఇటు హై లెవల్ లో కూడా అవే ప్లాన్స్ వేస్తున్నారట బొత్స సత్యానారాయణ. ఎప్పుడూ పాలిటిక్స్ లో తిరగని కుమారుడు సందీప్ ని.. పొలిటికల్ లైన్ లో తిప్పుతున్నారట. జగన్ కి కూడా పరిచయం చేశారట బొత్స.

మొన్న సీఎం జగన్ బర్త్ డే వేడుకల్లో భాగంగా.. సందీప్ తో రక్తదానం చేయించి.. అరంగేట్రం ప్లాన్ చేశారట సత్తి బాబు. సో..

వచ్చే ఎన్నికల్లోగా.. తనని ఫుల్ ఫ్లెడ్జ్ డ్ పొలిటీషియన్ ని చేసి.. ఓ మంచి నియోజకవర్గంలో సీటు ఇప్పించి.. ఎమ్మెల్యేనో ఎంపీనో చేయాలి అని చూస్తున్నారట.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top