Sunday, 09 Aug, 8.31 am NewsSting

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఏపీలో కరోనా విజృంభణ.. పాజిటివ్‌ కేసులు 10,080, మృతులు 97 మంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 62,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 24,24,393కి చేరింది. కొత్తగా 10,080 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు 2,17,040కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 97మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1,939కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకొని గత 24 గంటల్లో 9,151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 85,486 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. గత 24 గంటలుగా ఏపీలో కొత్తగా 10,080 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 97 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 1,939 మంది మృతి చెందారు.

కర్నూలు జిల్లాలో- 1,353, తూర్పుగోదావరిలో- 1,310, అనంతపురంలో-976, చిత్తూరు జిల్లాలో- 963, నెల్లూరులో- 878, విశాఖపట్నం- 998, గుంటూరు- 601, కడప- 525, పశ్చిమ గోదావరిలో- 681, విజయనగరంలో- 450, శ్రీకాకుళంలో- 442, కృష్ణాలో- 391, ప్రకాశంలో- 512 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 24,24,393 మందికి కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 2,14,145 పాజిటివ్ కేసులకు గాను 1,26,720 మంది డిశ్చార్జ్ కాగా 1,939 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85,486. కాగా..

కర్నూలు, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రోజూ ఏపీలో పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. అయితే.. టెస్టులు పెద్ద ఎత్తున చేస్తుండటంతో కేసులు కూడా పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.

కరోనా కేసుల పెరుగుదల సాధారణమే నబ్బా.. ఆరోగ్యశాఖ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం సాధారణమేనని ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ తర్వాతే కేసుల్లో పెరుగుదల కనిపించిందన్నారు.

రాష్ట్రంలోని ఉభయగోదావరి, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాలు పాజిటివ్‌ కేసుల్లో టాప్‌లో ఉన్నాయన్నారు. తాజాగా రాష్ట్రంలో సీడో సర్వెలెన్స్‌ సర్వే మొదలుపెట్టామని చెప్పారు. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే జరుగుతోందని, ఇది వారం రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. ఎంతమందికి ఇన్ఫెక్షన్‌ సోకి వెళ్లిపోయిందో ఈ సర్వేలో తెలుస్తుందన్నారు.

రాష్ట్రంలో ఈ సర్వేకు 3750 శాంపిల్స్‌ను సేకరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84వేల కేసులు యాక్టివ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 8.76 శాతం ఉందని, మరణాల శాతం 0.89గా ఉందని తెలిపారు. పరీక్షలతో సంబంధం లేకుండా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు.

3-4 రోజులు జ్వరం తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తక్షణమే ఆస్పత్రులకు తరలించాలని వలంటీర్లు, ఏఎన్‌ఎంలకు సూచించినట్టు తెలిపారు. శ్వాస తీసుకునే స్థాయిని తెలుసుకోడానికి ఏఎన్‌ఎంలకు పల్స్‌ఆక్సీమీటర్లు అందజేశామన్నారు. మరణం సంభవించకుండా ఆస్పత్రిలో చేరి, ఆరేడు రోజుల సమయం ఇవ్వగలిగితే వైద్యులు ప్రాణం పోస్తారని చెప్పారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 'టోసిలిజమ్‌' మందును కరోనా బాధితులకు ఇస్తున్నామని చెప్పారు.

పాజిటివ్‌ల పెరుగుదలకు ప్రజలూ బాధ్యత వహించాలన్నారు. వాక్సిన్‌, మందు వచ్చే వరకు మాస్క్‌ జీవితంలో భాగమన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు. జిల్లాలకు కొత్తగా మరో వెయ్యి వెంటిలేటర్లను ఇవ్వబోతున్నామని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top