తెలుగు హోం
హైదరాబాద్ కు చేరుకున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలను పరిశీలించేందుకు మూడు నగరాల్లో నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు.మొదట అహ్మదాబాద్ లోని జైడస్ క్యాడిలా సంస్థను సందర్శించారు. ఆ సంస్థ రూపొందిస్తున్న జైకోవ్-డి కొవిడ్ వ్యాక్సిన్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోదీ హైదరాబాదులో భారత్ బయోటెక్ క్యాంపస్ ను సందర్శిస్తారు. భారత్ బయోటెక్ లో కోవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఇది మూడో దశ ప్రయోగాల్లో ఉంది.
పూర్తి దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ కావడంతో కొవాగ్జిన్ పై అన్ని వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈరోజు ఉదయం గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకుని, అక్కడి నుంచి జైడస్ క్యాడిలా పార్కుకు చేరుకున్నారు మోదీ. ఆ సంస్థ అభివృద్ధి చేస్తున్న 'జైకోవ్-డి' టీకా ప్రయోగాలను మోదీ పరిశీలించారు. ఆ వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.
మోదీ పీపీఈ కిట్ ధరించి అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి ల్యాబ్లను పరిశీలించారు. మోదీని చూసేందుకు జైడస్ బయోటెక్ పార్క్ వద్దకు స్థానిక ప్రజలు భారీగా తరలిరావడంతో వారికి మోదీ అభివాదం చేశారు. హైదరాబాద్ పర్యటన అనంతరం ప్రధాని పుణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు.
related stories
-
తాజా రాబోయే 15 ఏళ్లలో మనుషులు అంతరిక్షంలోని ఉల్క బెల్ట్ కాలనీలో జీవించవచ్చు!
-
జాతీయం-అంతర్జాతీయం సీరం అగ్ని ప్రమాదంలో ఐదుగురు కార్మికుల దుర్మరణం
-
తాజా వార్తలు అంతరిక్షం నుంచి ఏనుగుల లెక్కింపు