తెలుగు హోం
జగన్ vs జస్టిస్ కేసులు.. కేంద్రం చేతిలోనే స్క్రీన్ ప్లే!

అంతన్నారు ఇంతన్నారు కేసులన్నీ కొట్టేశారు. సీఎం జగన్ రాసిన లేఖపై తనకి ఎలాంటి ప్రాబ్లమూ లేదు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఈ కేసు ఎవ్వారం ఇంకా తేలలేదు. వేసిన పిటిషన్లు అన్నీ కొట్టేయలేదు. కొన్ని పిటిషన్లు ఒకే రకంగా ఉండడంతో కొట్టేశారు అంతే. అలాగే.. సీఎం పదవి నుంచి తప్పించాలన్న పిటిషన్ ను కూడా కొట్టేసింది కోర్టు. రాసిన లేఖకు.. సీఎం పదవికి ఎలాంటి సంబంధం లేకపోవడంతో కొట్టేశారు అంతే. కానీ.. ఇంకా ఓ సీరియస్ పిటిషన్ ఉంది. అందులో.. జగన్ రాసిన లేఖ విరుద్ధం అనీ.. జస్టిస్ రమణ పై విచారణ జరపాలని కూడా ఉంది. అంటే.. ఈ పిటిషన్ తో రెండు పక్కల టార్గెట్స్ ఉన్నయ్. ఆ పిటిషన్ ను మాత్రం సుప్రీం కోర్టు స్వీకరించింది.
ఈ పిటిషన్ తో ఇద్దరూ టార్గెట్ అయ్యారు. అటు రమణ.. ఇటు జగన్ ఇద్దరూ టార్గెట్ లోనే ఉన్నారు. కానీ..
దీనిపై కేంద్రం ఎలా మూవ్ అవుతుంది.. సుప్రీం ఎలా మూవ్ అవుతుంది అనేది అసలు పాయింట్. అయితే.. ఈ కేసులో..
స్క్రీన్ ప్లే మొత్తం సెంట్రల్ సర్కార్ చేతిలోనే ఉంది అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఈ పిటిషన్ పై సీబీఐ దర్యాప్తు చేయాలా లేదా అన్నది సుప్రీం చేతిలో ఉంది. రమణ పై సీబీఐ దర్యాప్తు చేస్తే.. జగన్ గెలిచినట్లు..
రమణను చీఫ్ జస్టిస్ ను చేస్తే.. సీఎం జగన్ కి ఎదురు దెబ్బ తగిలినట్లు.కానీ.. ఇక్కడ సెంట్రల్ సర్కార్ కి మాత్రం ఎటు పోయి ఎటొచ్చినా ఏమీ కాదు. జస్టిస్ రమణను చీఫ్ జస్టిస్ చేయాల్సిన అవసరం లేదు..
ఆయనపై సీబీఐ దర్యాప్తు వేయాల్సిన అవసరం కూడా సెంట్రల్ కి లేదు. కేసు విచారణలో ఉంది కాబట్టి.. జగన్ చేతిలో ఉన్నట్లే. సీబీఐ దర్యాప్తు పడితే సీరియస్ అవుతుంది కాబట్టి..
రమణకి కూడా ప్రాబ్లమే. ఎటు పోయి ఎటు వచ్చినా.. సెంట్రల్ సర్కార్ ఎలా మూవ్ అవుతుంది. సుప్రీం కోర్టు నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నదానిపైనే డిపెండ్ అయి ఉంది.
అంతే తప్ప.. కేసులోంచి జగన్ బయటికి వచ్చినట్లు కాదు.. సీరియస్ ఏం లేదులే అనుకునేంత ఈజీ కూడా కాదు. ఇది చదవండి: జగన్ పై పిటిషన్ కొట్టివేసిన సుప్రీం కోర్టు..