Wednesday, 27 Jan, 6.02 pm NewsSting

తెలుగు హోం
జనవరి 29న సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్..ఎలా ఉండనుందో

ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది మంచు ఫ్యామిలీ. మోహన్ బాబు కూడా తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలని ఎప్పటికప్పుడు సోషల్ మీడయాలో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ కి ఆనందాన్నిస్తున్నాడు. ఓ పక్క ఆర్టిస్టుగా నటిస్తూనే..మరోపక్క ప్రధానపాత్రల్లో మెరుస్తున్నాడీ సీనియర్ హీరో. ఆయన రీసెంట్ గా సన్ ఆఫ్ ఇండియా మూవీలో ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న భారీ చిత్రం సన్ ఆఫ్ ఇండియా. డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను మోహన్ బాబు సొంతబ్యానర్ లక్ష్మీప్రసన్న ఫిలిమ్స్ 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో పవర్ ఫుల్ మూవీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. తన కెరీర్ లో ఇంతవరకు పోషించని డిఫరెంట్ పాత్రలో మోహన్ బాబు కనిపించ బోతున్నాడట. అలాగే ఇంతవరకు దేశభక్తి నేపథ్యంలో ఇలాంటి కథ కానీ సినిమా గాని తెలుగులో రాలేదని సినీబృందం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సన్ ఆఫ్ ఇండియా..

ఇటీవలే రెండో షెడ్యూల్ షూట్ హైదరాబాద్లో ప్రారంభించారు.అయితే ఈ సినిమాను దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.అదేంటంటే.. 'సన్ ఆఫ్ ఇండియా' నుండి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో అంటే..

జనవరి 29న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమాకు సంగీతం మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అందిస్తుండటం విశేషం. గతంలో మోహన్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించడం జరిగింది. కానీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో సినీప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో..తమిళ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా చిత్రంలో మెరిశాడు మోహన్ బాబు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top