Wednesday, 27 Jan, 4.49 pm NewsSting

తెలుగు హోం
కేసీఆర్ మీద బండి సంజయ్ ఆరోపణలు.. కాంగ్రెస్ నాయకులకు కూడా చిర్రెత్తుకొచ్చింది

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసే వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, కేటీఆర్ ను టార్గెట్ చేసి ఎన్నో ఆరోపణలు గుప్పించారు. బండి సంజయ్ చేసే వ్యాఖ్యల్లో నిజం ఉందో.. లేదో తెలియదు కానీ.. వరుసగా అలాంటి ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇదే తంతు నడుస్తూ వస్తోంది. కేసీఆర్ అవినీతికి కూడా పాల్పడ్డారంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలను చేశారు. తాజాగా బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. బండి సంజయ్ అన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు సాక్ష్యాలు లేవా..? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అవినీతిపరుడని ఆరోపిస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ .. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తావించాల్సిన అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ చేస్తున్న అవినీతిని పార్లమెంటులో ప్రస్తావించనున్నట్టు తెలిపారు.

కాళేశ్వరం, సీతారామ, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైలును సంగారెడ్డి వరకు పొడిగించాలన్న డిమాండ్‌తోపాటు నల్లమలలో యురేనియం తవ్వకాలు, మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు, పసుపు బోర్డు ఏర్పాటు, బీబీనగర్ ఎయిమ్స్, బయ్యారం ఉక్కుపరిశ్రమ వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని ఉత్తమ్ కుమార్ చెప్పుకొచ్చారు. బండి సంజయ్ దగ్గర కేసీఆర్ అవినీతికి సంబంధించిన సమాచారం ఉన్నప్పుడు బహిర్గతం ఎందుకు చేయడం లేదో చెప్పాలని కూడా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సాక్ష్యాలు లేకుండా ఊరికే ఆరోపణలు చేస్తూ వెళితే ప్రజలు కూడా బండి సంజయ్ ను లైట్ గా తీసుకుని ప్రమాదం లేకపోలేదు. కేటీఆర్ సీఎం ఎలా అవుతారో లెక్కలు చెప్తారా..

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News sting Telugu
Top