తెలుగు హోం
క్రాక్ లో పిల్లోడిపై ఆరా.. డైరెక్టర్ కొడుకేనట

మాస్ మహారాజ్ రవితేజకి చాలా కాలం గ్యాప్ తర్వాత విజయాన్ని అందించిన చిత్రం క్రాక్ అనే చెప్పాలి. ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతోంది. కాగా సంక్రాంతికి రిలీజ్ అయిన క్రాక్ వారం రోజుల్లోనే దాదాపు రూ.25కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికే రవితేజ నటించిన చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన చిత్రంగా క్రాక్ నిలిచిపోయింది. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకంగా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు రవితేజ. ఎందుకంటే ఒకటి రెండు కాదు నాలుగేండ్ల తర్వాత వచ్చిన విజయం కావడంతో దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు మాస్ రాజా . మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేనికి సైతం ఈ చిత్రం చాలా ప్రత్యేకం.
ఈయనకు కూడా నాలుగేండ్ల తర్వాత వచ్చిన విజయమే ఇది.దీని కంటే ముందు ఈయన తెరకెక్కించిన విన్నర్ సినిమా 2017లో విడుదలైంది. అది డిజాస్టర్. దానికంటే ముందు వచ్చిన పండగ చేస్కో కూడా యావరేజ్. దాంతో హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు గోపీచంద్ మలినేని. ఇక క్రాక్ విషయంలో మరోటి కూడా గోపీచంద్‌కు మరుపురాని విషయం. ఈ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడికి మంచి అప్లాజ్ వచ్చింది. ఎవర్రా ఈ కుర్రాడు.. భలే ఉన్నాడు.. పైగా మాస్ రాజాపై నాన్ స్టాప్ పంచులు వేస్తున్నాడంటూ మాట్లాడుకున్నారు. కుర్రాడెవరో కానీ దర్శక నిర్మాతలు భలే పట్టుకున్నారు.. ఈ చిచ్చర పిడుగుకు మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్నారు. అయితే ఆ తర్వాతే తెలిసింది ఈ కిరాక్ పుట్టించిన కుర్రాడెవరా అని..?
related stories
-
ప్రధాన వార్తలు హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ మూవీ?
-
హోమ్ ఆర్ఆర్ఆర్ను మించిన భారీ బడ్జెట్‌తో ప్రభాస్ సినిమా..?
-
తాజావార్తలు రాజ్ తరుణ్.. ఏమిటి కర్మ ?